schedule Saturday, July 04, 2026

ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం

calendar_today February 16, 2026
person dharshininews
ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం
ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం - మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన కౌన్సిలర్లు - మీడియాకు వివరాలు వెల్లడించిన నాగారం మల్లేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి నాగారం మల్లేశం, 23వ వార్డు నుంచి అంతారం కిరణ్‌, 33వ వార్డు నుంచి శ్రీకాంత్ రెడ్డిలు గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలచిన కౌన్సిలర్ల చేత సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్‌, శ్రీకాంత్‌ రెడ్డిలు హాజరై తాము ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా నాగారం మల్లేశం మాట్లాడుతూ ఎల్లుండి బుధవారం చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకనే కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయలేదని స్పష్టం చేశారు. https://www.dharshininews.com/41371/