schedule Monday, September 07, 2026

మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు..!

calendar_today February 18, 2026
person dharshininews
మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు..!
మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు..! - సన్మానించిన కమిషనర్, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజబాల్ రెడ్డికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి దంపతులను, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లను శాలువాలతో సన్మానించారు. ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ పాలనలో సమన్వయంతో కలిసి ముందుకు సాగుదామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ అల్లపురం శ్రీకాంత్, మేనేజర్ నరేందర్ రెడ్డి, డిఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, సానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.   https://www.dharshininews.com/41920/