schedule Monday, September 07, 2026

కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం

calendar_today February 18, 2026
person dharshininews
కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం
కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం - సొంత ఖర్చులతో హైమస్ట్ లైట్ల మరమ్మతులు - రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్‌ కాలనీలో రాత్రి పూట చీకటి ఇబ్బందులకు వార్డు కౌన్సిలర్ జావిద్ దూరం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాలనీలో విద్యుత్ దీపాలు సక్రమంగా పనిచేయడం లేదు. మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో రాత్రి పూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన జావిద్ కాలనీ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా బుధవారం కాలనీలో తన సొంత ఖర్చులతో హైమస్ట్ లైట్ల మరమ్మత్తులు చేయించారు. ఆయన దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. కాలనీలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కౌన్సిలర్ జావిద్ చూపిస్తున్న చొరవను స్థానికులు అభినందిస్తున్నారు. అదేవిధంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని పేర్కొన్నారు. అందరి సహాకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. https://www.dharshininews.com/41923/