schedule Saturday, July 04, 2026

రేషన్ షాపు ఏర్పాటు చేయండి

calendar_today February 21, 2026
person dharshininews
రేషన్ షాపు ఏర్పాటు చేయండి
రేషన్ షాపు ఏర్పాటు చేయండి - తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, స్థానికులు కోరారు. శనివారం తాండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ తారాసింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందిరానగర్‌లోని గుండపీర్లు వద్ద ఉన్న ప్రజలకు రేషన్ షాపు అందుబాటులో లేదని, రేషన్ బియ్యం, సరుకులు తెచ్చుకోవాలంటే దూరం వెళ్లాల్సి వస్తుందని తహాసీల్దార్ దృష్టికి తీసుకవచ్చారు. కావున గుండుపీర్ల వద్ద కొత్త రేషన్ షాపు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞఫ్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ షాయిబ్, అబు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/41995/