schedule Saturday, July 04, 2026

వెల్లివిరిసిన మతసామరస్యత

calendar_today February 22, 2026
person dharshininews
వెల్లివిరిసిన మతసామరస్యత
వెల్లివిరిసిన మతసామరస్యత - ఇఫ్తార్ విందు ఇచ్చిన బిడ్కర్ రఘు - గాంధీనగర్‌లో పాల్గొన్న ముస్లిం సోదరులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్‌లో మత సామరస్యత వెల్లివిరిసింది. రంజాన్ మాసంను పురస్కరించురకుని కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్‌ రఘు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. అనంతరం రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు ముస్లిం సోదరులకు పండ్లు పలహారాలు అందించి ఉప వాస దీక్షలను విరమింప జేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు మతాలకు అతీతంగా పాల్గొన్నారు. దీంతో గాంధీనగర్‌లో మత సామరస్యత వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్‌, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, స్థానిక పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42017/