schedule Saturday, July 04, 2026

వైభవంగా రాములోకి కళాకర్షణ..!

calendar_today February 25, 2026
person dharshininews
వైభవంగా రాములోకి కళాకర్షణ..!
వైభవంగా రాములోరి కళాకర్షణ..! - శాస్త్రోక్తంగా పునరుద్దరణ క్రతువు - వచ్చేనెల పునఃప్రతిష్టాపన ఉత్సవాలు - శ్రీరామ నవమికి సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన - ఇందిరానగర్‌ రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌ రామ మందిరంలో రాముల వారి కళాకర్ణణ వైభవంగా జరిగింది. బుధవారం దేవాలయ అర్చకులు, వేదపండితులు క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో కళాకర్షణ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు. ఇందిరా నగర్ రామ మందిరంలో దేవాలయ పునరుద్దరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేవాలయంలోని సీతారాముల విగ్రహాలను బయటకు తీసి వేదపండితులు కళాకర్షణ జరిపించారు. ఈ సందర్బంగా పండితులు మాట్లాడుతూ గర్భాలయంలోని మూలమూర్తుల శక్తిని మంత్రోచ్ఛారణల ద్వారా పండితులు కుంభం (కలశం) లోకి ఆవాహన చేయడం జరుగుతుందని వివరించారు. బుధవారం నుంచి దేవాలయంలో మండల పూజలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దేవాలయ పునర్ నిర్మాణం అయిన తరువాత వచ్చేనెల మార్చి 25 నుంచి 27వ తేది వరకు సీతారాముల విగ్రహాల పునఃప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీరామ నవమి నాటికి విగ్రహాప్రతిష్టాపన పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. దేవాలంయలో జరిగే మండల పూజలతో పాటు దేవాలయ పునర్ నిర్మాణానికి తోడ్పాటు అందించి స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాములోకి కళాకర్షణతో పాటు స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ ఆరాధన కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో డా.సంపత్ కుమార్, దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42135/