schedule Monday, September 07, 2026

కేవీసీఎస్‌లో సైన్స్ డే..!

calendar_today February 28, 2026
person dharshininews
కేవీసీఎస్‌లో సైన్స్ డే..!
కేవీసీఎస్‌లో సైన్స్ డే..! - సమాజ శ్రేయస్సులో సైన్స్‌ కీలకం - సాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ - ఆకట్టుకున్న ప్రదర్శనలు, విజేతలకు బహుమతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్‌ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. kvcs ముందుగా డాక్టర్‌ సీవీ రామన్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సైన్స్ డే సందర్భంగా స్కూల్ విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు. సాంకేతిక రంగంలో సైన్స్‌ ప్రాముఖ్యతను వివరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ నేటి ఆధునిక జీవనం సైన్స్ తో ముడిపడి ఉందన్నారు. ఈ సైన్స్ వల్ల విద్యార్థుల్లో, మానవ జీవన శైలిలో వికాసం పెంపొందుతున్నారు. శాస్త్ర రంగంలో రాణించిన సీవీ రామన్, అబ్దుల్ కలాం, నంబీ నారాయణణ్, జగదీష్‌ చంద్రబోష్‌, విక్రమ్ సారాభాయ్‌ తదితర మహనీయుల స్పూర్తితో విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. మరోవైపు విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌ పోటీలలో గెలుపొందిన వారికి బహుతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42204/