schedule Monday, September 07, 2026

శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..!

calendar_today February 28, 2026
person dharshininews
శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..!
శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..! - ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞాన ప్రదర్శనలు - అభినందించిన పాఠశాల డైరెక్టర్ మణిమాల తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్‌లో సైన్స్ డేను సంబరంగా జరుపుకున్నారు. శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలను సందర్భంగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సైన్స్‌ డేను పురస్కరించుకుని ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రాజెక్టులు, ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్ మణిమాల మాట్లాడుతూ, విజ్ఞానం మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. సైన్స్‌ టీచర్లు మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సైన్స్ ప్రదర్శన, మోడల్స్ ఎగ్జిబిషన్, క్విజ్ పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42213/