schedule Monday, September 07, 2026

పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత

calendar_today March 7, 2026
person dharshininews
పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత
పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - 13వ వార్డులో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక - మున్సిపల్ కార్మికులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం 13వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయవద్దని కోరారు. చెత్తను రోడ్ల పైన వెళ్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అన్నారు. ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని అన్నారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయవద్దని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు రావని విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తారా సింగ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, కౌన్సిలర్ సురేష్, మేనేజర్ నరేందర్ రెడ్డి, టీపీబీఓలు ప్రియా, నరేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, వార్డ్ ఆఫీసర్ రాఘవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42284/