schedule Monday, September 07, 2026

కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..!

calendar_today March 11, 2026
person dharshininews
కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..!
కలెక్టర్‌ను సన్మానించిన చైర్ పర్సన్..! - మొక్కను బహుకరించిన పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దీపక్ తివారిని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి సన్మానించారు. బుధవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌కు చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి స్వాగతం పలికారు. కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి.. మొక్కను బహుకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ దీపక్ తివారితో కలిసి చైర్ పర్సన్ ఆసుపత్రిలో జరిగిన తనిఖీలలో పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రిలో కావాల్సిన సదుపాయాలు, సేవలపై చైర్ పర్సన్‌ కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డిలు కూడా ఉన్నారు. https://www.dharshininews.com/42423/