schedule Monday, September 07, 2026

బుయ్యనిపై అభిమానం..!

calendar_today March 11, 2026
person dharshininews
బుయ్యనిపై అభిమానం..!
బుయ్యనిపై అభిమానం..! - జనగామలో ఘనంగా జన్మదినం - శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నేత, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై పెద్దేముల్ మండలం జనగాం గ్రామ నేతలు అభిమానం చాటుకున్నారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన దొరోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన చౌరస్తా వద్ద బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కోట్‌పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ మంబాపూర్ నారాయణ రెడ్డి హాజరై నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రజా నేతగా అందరి మనుసులో నిలిచిపోయారని అన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి.. పేదలకు తోడ్పాటు అందిసేవలతో చెరగని ముద్ర వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, చెక్కల శివకుమార్, మల్లేశం, నర్సింలు, కల్వ నాగయ్య, బసిరెడ్డి, రాంచెందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42430/