schedule Friday, September 04, 2026

ఒంటిపూట బడులకు వేళాయే..!

calendar_today March 12, 2026
person dharshininews
ఒంటిపూట బడులకు వేళాయే..!
ఒంటిపూట బడులకు వేళాయే..! - 15 నుంచి నిర్వహణకు ఆదేశాలు - స్కూళ్ల కొత్త టైమింగ్‌ షెడ్యూల్‌ విడుదల - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోజు రోజుకు ముదురుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఒన్ టైం స్కూల్ నిర్వహణపై ఆదేశాలు ఇచ్చింది. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయని వెల్లడించింది. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల విషయంలో విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఏ పాఠశాలల్లో అయితే SSC పరీక్షా కేంద్రాలు ఉన్నాయో, ఆ పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని సాధారణ రోజుల్లో మాత్రం మిగిలిన పాఠశాలల వలె ఉదయం 8:00 నుండి 12:30 వరకు ఒంటిపూట బడులుగానే కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. https://www.dharshininews.com/42456/