schedule Saturday, July 04, 2026

పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి

calendar_today March 16, 2026
person dharshininews
పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి
పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలి - పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి - పారిశుద్ధ్య కార్మికుల హాజరు పరిశీలన - విధుల నిర్వహణపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిశుద్ధ్య విధులను సక్రమంగా నిర్వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారుజామున తాండూరు మున్సిపల్ పాత కార్యాలయంలో కార్మికుల హాజరును ఆమె పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. పారిశుద్ధ కార్మికులు విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా పనిచేయలన్నారు. ప్రతిరోజు మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని అన్నారు. చెత్తాచెదారం లేకుండా చూడాలని అన్నారు. విధుల్లో అవకతవకలకు పాల్పడకుండా ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు ఉన్నారు.   https://www.dharshininews.com/42575/