schedule Monday, September 07, 2026

ఆపదల 'రూప' మాపు..!

calendar_today March 16, 2026
person dharshininews
ఆపదల 'రూప' మాపు..!
ఆపదల 'రూప' మాపు..! - వార్డు ప్రజలకు అండగా బీఆర్ఎస్ కౌన్సిలర్‌ - ట్యాంకర్లతో తాగునీటి ఇక్కట్లు దూరం - చీకట్ల తొలగింపుకు సొంత నిధులతో లైట్ల ఏర్పాటు - 36వ వార్డులో రూప రుద్రుపాటిల్‌కు ఆదరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : నమ్మి గెలిపించిన ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా దానిని రూపు మాపేందుకు సిద్దంగా ఉంటానని తాండూరు మున్సిపల్ పరిధి 36వ వార్డు కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ భరోసా ఇస్తున్నారు. గత ఐదు రోజులుగా వార్డులో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలు నీటి కోసం పడుతున్న ఇక్కట్లను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపించారు. వార్డు ప్రజలకు అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. నీటి అవసరాల కోసం అల్లాడుతున్న విషయాన్ని గమనించి.. పరిష్కారానికి చొరవ చూపించిన కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్‌ను పలువురు అభినందిస్తున్నారు. కేవలం తాగునీటి సమస్య పరిష్కారం ఒక్కటే కాకుండా వార్డు ప్రజలకు ఏలాంటి ఆపద వచ్చినా కౌన్సిలర్ రూపతో పాటు ఆమె భర్త రుద్రుపాటిల్‌ అండగా నిలుస్తున్నారు. ఇటివల వార్డులో విద్యుత్‌ స్థంబాలకు లైట్లు లేకపోవడంతో సొంత డబ్బులతో 16 వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. రానున్న రోజుల్లో కూడా వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా కృషి చేస్తానని రూప రుద్రుపాటిల్ అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలకు కట్టుబడి సేవలందిస్తున్న రూప రుద్రుపాటిల్‌ను వార్డు ప్రజలు అభినందిస్తున్నారు. https://www.dharshininews.com/42588/