schedule Monday, September 07, 2026

రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు

calendar_today March 18, 2026
person dharshininews
రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు
రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు - మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన మోయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనలో రోహిత్ రెడ్డి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్‌ వినియోగదారుడే కాదు, పెడ్లర్‌(విక్రయించే వ్యక్తి) అని ఆరోపించారు. ఆయనకు ఆంధ్రా, కర్ణాటక, ఢిల్లీ వంటి అంతర్‌రాష్ట్ర ముఠాలతో సంబంధాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏవిషయంలో చూసినా ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సూత్రదారిగా ఉన్న రోహిత్ రెడ్డి, ఆయనకు చెందిన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్‌ వ్యవహారంలో కేసులు నమోదుయ్యాయని గుర్తు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. https://www.dharshininews.com/42621/