schedule Saturday, July 04, 2026

బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..!

calendar_today March 19, 2026
person dharshininews
బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..!
బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..! - బీఆర్‌ఎస్‌ నుంచి రాజుగౌడ్‌ను సస్పెండ్‌ చేయాలి - పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలి - బంజారా సమాజ్‌ నేతల డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారా జాతి పేరుతో విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని తాండూరు బంజారా సమాజ్‌ నేతలు డిమాండ్ చేశారు. గురవారం వారు మీడియాతో మాట్లాడారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ను ఉద్దేశిస్తూ రాజుగౌడ్‌ బంజారా జాతిపై వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమేనని, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని అన్నారు. ధారాసింగ్‌పై, జాతిపై వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జాతిపై విమర్శలు చేసిన రాజుగౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అన్నారు. అదేవిధంగా బంజారా జాతిపై విమర్శలు చేసిన రాజుగౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు కూడా రాజుగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా సమాజ్ ఉపాధ్యక్షులు అనిల్ కుమార్‌ రాథోడ్, ప్రధాన కార్యదర్శి గోపాల్, జాయింట్ సెక్రటరీ చందర్ చౌహాన్, పవన్ కుమార్, రమేష్‌, శ్రీను జాదవ్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42654/