schedule Saturday, July 04, 2026

భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..!

calendar_today March 20, 2026
person dharshininews
భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..!
భట్టి బడ్జెట్‌.. ఉట్టి అంకెల గారడీ..! - రాష్ట్ర ప్రజలకు ఒరిగేది శూన్యం - బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఉట్టి అంకెల గారడిగా ఉందని బీఆర్‌ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేశారు. గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెన్‌ను కాస్త పెంచి ప్రవేశ పెట్టారు తప్పా కొత్తగా చేసిందేమి లేదని అన్నారు. అంకెల గారడీగా ప్రజలను మోసం చేసేదిగా ఉందని విమర్శించారు. బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేది శూన్యమని అన్నారు. మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను వంచించిన బడ్జెట్ అని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే స్కీమ్‌లకు సరైన కేటాయింపులు లేవని, అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారని వెల్లడించారు. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైందని అన్నారు. అయినా కూడా మళ్లీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. https://www.dharshininews.com/42694/