schedule Friday, September 04, 2026

పాఠకులకు మెరుగైన సేవలు

calendar_today March 29, 2026
person dharshininews
పాఠకులకు మెరుగైన సేవలు
పాఠకులకు మెరుగైన సేవలు - తాండూరు లైబ్రరీయన్ కిష్టప్ప - రీడర్స్, యువతకు సభ్యత్వం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రంథాలయంలో పాఠకుల పఠనాశక్తిని పెంచేందుకు దృష్టిసారిస్తున్నట్లు తాండూరు లైబ్రరీయన్ కిష్టప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రంథాలయంలో విద్యార్థులు, రీడర్స్‌లకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఆదేశాను సారం తాండూరు శాఖ గ్రంథాలయంలో ప్రజా పాలనలో భాగంగా ఈ నెల మార్చి 23 నుండి 29 వరకు మొదటి రోజు నుండి వివిధ కార్య క్రమాలు చేయడం జరిగిందని వివరించారు. తాండూరు గ్రంథాలయం ద్వారా పాఠకులకు మెరుగైన సేవలు అందిచేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అందుకోసం గ్రంథాలయంలో పాఠకుల ద్వారా సభ్యత్వం చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42904/