schedule Monday, September 07, 2026

పార్టీ బలోపేతమే ధ్యేయం..!

calendar_today April 9, 2026
person dharshininews
పార్టీ బలోపేతమే ధ్యేయం..!
పార్టీ బలోపేతమే ధ్యేయం..! - ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల అమలుకు కృషి - కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ - తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ నాయక్‌ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ధ్యేయమని ఆ పార్టీ నూతన వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం చేయడం పట్ల తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌లను ఆయన మర్యాదపూర్వంగా కలిశారు. తనపై నమ్మకంతో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానని, అభివృద్ధిపై అందరిని చైతన్య పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భారత్ రెడ్డి, అంతారం శ్రీనివాస్, గాజుల వెంకట్‌ తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/42990/