schedule Saturday, September 05, 2026

మెరిసిన మొయిజ్..!

calendar_today April 9, 2026
person dharshininews
మెరిసిన మొయిజ్..!
మెరిసిన మొయిజ్..! - గోల్డ్ మెడల్ సాధించిన తాండురోడు - నేషనల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ లో సత్తా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన లారీ డ్రైవర్ కుమారుడు మొయిజ్ నేషనల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ లో బంగారంలా మెరిశాడు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి తాండూరుకే గర్వకారణంగా నిలిచాడు. పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన ట్రక్ డ్రైవర్ మహమ్మద్ రఫీక్ కుమారుడు మొయిజ్ నేపాల్ లోని ఖాట్మండులో జరిగిన షూటింగ్ బాల్ టోర్నమెంట్ కు తాండూరు నుంచి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొయిజ్ సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో మొయిజ్ కు గోల్డ్ మెడల్ వరించింది. గోల్డ్ మెడల్ తో పాటు మొయిజ్ కు ట్రోఫీని అందజేశారు. మరోవైపు తాండూరు యువకుడు నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మొయిజ్ కు అభినందనలు తెలిపారు. https://www.dharshininews.com/42992/