schedule Monday, September 07, 2026

దేశ సమగ్రతకు ఎన్ఎస్‌యూఐ కృషి

calendar_today April 9, 2026
person dharshininews
దేశ సమగ్రతకు ఎన్ఎస్‌యూఐ కృషి
దేశ సమగ్రతకు ఎన్ఎస్‌యూఐ కృషి - విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం - ఘనంగా ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సం - తాండూరు ఎమ్మెల్యేకు అంకిత్‌ అనురాగ్‌ శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ సామాజిక సమగ్రత కోసం ఎన్ఎస్‌యూఐ కృషి చేస్తుందని వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్‌ అన్నారు. గురువారం ఎన్ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ నాయకులకు ఎన్ఎస్‌యూఐ శక్తివంతమైన వేదికగా నిలిచిందని అన్నారు. దేశానికి ఎన్ఎస్‌యూఐ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులను అందించిందని అన్నారు. దేశ సమగ్రత కోసం ఎన్ఎస్‌యూఐ కృషి చేస్తుందని అన్నారు. కేవలం రాజకీయాలే కాకుండా విద్యార్థుల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని అన్నారు. ఎన్ఎస్‌యూఐ ద్వారా విద్యార్థి నాయకులను దేశ సమగ్రతలో భాగస్వామ్యం చేస్తుందని అన్నారు. అదేవిధంగా తన రాజకీయ ప్రస్థానం ఎన్‌ఎస్‌యూఐ నుంచే మొదలు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్‌లు ఉన్నారు. https://www.dharshininews.com/42997/