schedule Saturday, July 04, 2026

కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్

calendar_today April 13, 2026
person dharshininews
కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్
కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్ - నిర్మాణ పనులపై పబ్లిక్ హెల్త్ శాఖ పరిశీలన - వివరాలు తెలుసుకున్న ఈఇన్ సీ భాస్కర్ బృందం - తాండూరు మున్సిపల్‌లో అభివృద్ధి పనుల సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాగ్నానది పంపుహౌస్‌ పైపులైన్‌ పనులను వేగిరం చేసేందుకు పబ్లిక్ హెల్త్ శాఖ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం పబ్లిక్‌ హెల్త్ శాఖ అధికారులు తాండూరు పట్టణంను సందర్శించారు. ఈఇన్ సీ భాస్కర్ బృందం పట్టణంలో పర్యటించారు. రూ. 18 కోట్లతో కాగ్నానది పంపుహౌస్‌ల నుంచి చేపట్టే కొత్త పైపులైన్‌ నిర్మాణ పనులను సమీక్షించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లతో కలిసి కాగ్నానది కొత్త పంపుహౌస్, పాత పంపుహౌస్‌లను సందర్శించారు. ఆయా మార్గాల నుంచి కొత్త పైపులైన్‌ పనుల వివరాలను పరిశీలించారు. పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఈఇన్ సీ భాస్కర్ సూచించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. పనులు దశలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ ప్రభాకర్, డీఈ సాజిద్, మున్సిపల్ ఏఈ ఖాజా, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43062/