schedule Tuesday, September 08, 2026

అందరివాడు అంబేద్కర్..!

calendar_today April 14, 2026
person dharshininews
అందరివాడు అంబేద్కర్..!
అందరివాడు అంబేద్కర్..! - ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం - అంబేద్కర్ స్పూర్తితో సర్కారు పాలన - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం రచించిన డా.బీఆర్ఎస్ అంబేద్కర్ అందరివాడుగా నిలిచారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం తాండూరు పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శ పురుషుడు అని అన్నారు. ఆయన రాజ్యాంగం రచించడం వల్ల అందరు ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారని అన్నారు. ఆయన అడుగు జాడల్లో అందరు నడవాలని సూచించారు. అంబేద్కర్ ఆలోచనలతోనే ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్‌ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, విజయలక్ష్మీ పండిత్, జుబేర్ లాల, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్, నాయకులు బంటు మల్లప్ప, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, నారా శ్రీలత, నేతలు, కార్యకర్తలు ఉన్నారు. https://www.dharshininews.com/43069/