schedule Tuesday, September 08, 2026

కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం

calendar_today April 14, 2026
person dharshininews
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - రెడ్డిగణాపూర్‌లో కుటుంబీకులకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నర్సప్ప కుటుంబానికి అండగ ఉంటామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నర్సప్ప ఆదివారం రాత్రి యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని బ్రిడ్జి గుంతలో బైకుతో పాటు పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రెడ్డిగణాపూర్‌ గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సప్ప చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి.. కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చారు. అదేవిధంగా పోలీసు శాఖ పరంగా అందాల్సిన సదుపాయాలు త్వరితగతిన అందేలా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు అజయ్ ప్రసాద్, గ్రామస్తులు, యువకులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43071/