schedule Saturday, July 04, 2026

కారు బోల్తా..!

calendar_today April 18, 2026
person dharshininews
కారు బోల్తా..!
కారు బోల్తా..! - కాంగ్రెస్ యువనేతకు గాయాలు - యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కారు బొల్తా కొట్టిన ఘటనలో కాంగ్రెస్ యువనేతకు గాయాయ్యాలయి. ఈ సంఘటన శనివారం యాలాల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలంకు చెందిన కాంగ్రెస్ యువ నాయకులు వికాష్ జోషి కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ బయల్దేరారు. మార్గమద్యలోని నాగసముందర్ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. వెంటనే కారు బొల్తా పడింది. ఈ క్రమంలో కారులో ఉన్న వికాష్‌ జోషి, ఆయన సతీమణికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని వికారాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. https://www.dharshininews.com/43135/