schedule Saturday, July 04, 2026

తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today April 25, 2026
person dharshininews
తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - నియోజకవర్గ వర్గ అభివృద్ధికి ప్రాధాన్యం - జిల్లా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా కమిటి అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ అభివర్ణించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉండడం ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎందరో నాయకులను చూసిన ప్రజలు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి దార్శనీకత్వానికి జేజేలు పలుకుతున్నారని అన్నారు. రెండున్నరేళ్లలోనే తాండూరు–వికారాబాద్ రోడ్డు అభివృద్ధి చేశారని, రూ. 18 కోట్లతో తాండూరు అంతర్గత రోడ్ల నిర్మాణం చేస్తున్నారని, ప్రతిష్టాత్మకంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంకు పాటుపడుతున్నారని అన్నారు. కాగ్నా కొత్త పైపులైన్‌ కోసం రూ. 30 కోట్ల ప్రాజెక్టు చేపడుతున్నారని కృషిని కొనియాడారు. తాండూరు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న మనోహర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. https://www.dharshininews.com/43181/