schedule Sunday, September 06, 2026

ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..?

calendar_today May 3, 2026
person dharshininews
ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..?
ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..? - తాండూరులో ఇదేం ప్రజా పాలన - బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన ఇళ్లను ఒకే సామాజిక వర్గానికి అధిక మొత్తంలో ఎలా కేటాయిస్తున్నారని మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ మండిపడ్డారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరులో ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నా కూడా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీలో ఆధిపత్యం వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తాండూరులో పేదల కోసం కేటాయించిన ఇళ్లలో 200లపైగా ఇళ్లను తమ సామాజిక వర్గానికి కేటాయించేలా చూస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్ పర్సన్‌కు తెలిసే జరుగుతుందా అని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీలో అన్యాయం జరుగుతుందని తెలిసి నిజమైన అర్హులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇండ్ల పంపిణీ ఆరోపణలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అర్హులైన పేదలకే డబుల్‌ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా చూడాలని, ఇందులో ఎలాంటి అవినీతికి తావులేకుండా త్వరగానే పంపిణీ చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి కుట్రలు చేసినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. https://www.dharshininews.com/43183/