పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం
May 3, 2026
dharshininews
పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం
- డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై తప్పుడు సంకేతాలు
- బీజేపీ, బీఆర్ఎస్ రాద్దాంతపు రాజకీయాలు
- డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు మేలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దంగా ఉంటుదని, అలాంటి పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ హెచ్చరించారు.
తాండూరులో చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుల, మతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అందాలని ఆకాంక్షతో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేకు ఎక్కడ ఆదరణ దక్కుతుందో అని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మింగుడు పడడం లేదని అన్నారు.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఆశ చూపి ఓట్లు లకునారు తప్పా.. ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు దేనికైనా సిద్దంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీపై అనవసర విమర్శలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
https://www.dharshininews.com/43194/