schedule Saturday, July 04, 2026

ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు

calendar_today May 4, 2026
person dharshininews
ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు
ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు - జావిద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో బీఆర్ఎస్ కౌన్సిలర్‌ జావిద్ అరెస్టు ఉద్రిక్తంగా మారింది. సోమవారం తాండూరులో జరిగే రైతు వారోత్సవాల ప్రారంభానికి విచ్చేస్తున్న మంత్రులను అడ్డుకుంటామని కౌన్సిలర్ జావిద్ రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాలాల పోలీసులు ఉదయం కౌన్సిలర్ జావిద్‌ను రాజీవ్ కాలనీ వద్ద అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీసు సిబ్బంది జావిద్ నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాలనీ మహిళలు జావిద్‌ను అదుపులోకి తీసుకోకుండా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జావిద్‌ను అదుపులోకి తీసుకుని పెద్దేముల్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఎన్ని నిర్బంధాలు చేసినా అవినీతి, అక్రమాలపై పోరాటం ఆపేది లేదని అన్నారు. https://www.dharshininews.com/43205/