schedule Saturday, July 04, 2026

కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు

calendar_today May 4, 2026
person dharshininews
కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు
కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు - ఈనెల 11న ఎన్నికల ప్రక్రియ - మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లోని కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తికి 19 నామినేషన్లు దాఖలైనట్లు కమీషనర్‌ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం నాటికి నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసిందని చెప్పారు. చివరి రోజు నాటికి మొత్తం 19 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఇందులో మైనార్టీ స్థానాల కోసం 4 జనరల్(పురుషులు), ఇద్దరు మహిళలు నామినేషన్లు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా అనుభవజ్ఞుల కోటాలో 13 నామినేషన్లు రాగా అందులో 8 జనరల్(పురుషులు), 5 మహిళల నుంచి నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. దీంతో కోఆప్షన్ సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యిందని స్పష్టం చేశారు. ఈనెల 11న ఎన్నికల ప్రక్రియ నిర్వహించి సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. https://www.dharshininews.com/43209/