schedule Monday, September 07, 2026

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు

calendar_today May 5, 2026
person dharshininews
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు - నాలుగు మండలాలు, పట్టణ అధ్యక్షుల నియామకం - ప్రకటించిన టీపీపీసీ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షుల నియామకం ఖరారయ్యింది. అధ్యక్షుల నియామకానికి తెరపడింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్ గౌడ్‌ తాండూరు నియోజకవర్గంలోని మండలాలు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. తాండూరు మండలం నూతన అధ్యక్షులుగా కరణ్‌ కోట్ సర్పంచ్ మైల్వార్ రాజ్ కుమార్, బషీరాబాద్‌ మండల అధ్యక్షులుగా రాజవర్దన్ రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులుగా పిన్నెముల మహిపాల్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులుగా కుర్వ మహిపాల్, తాండూరు పట్టణ అధ్యక్షులుగా యువ నాయకులు రోయ్యల నాగరాజ్‌లను నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అధ్యక్ష పదవులను అప్పగించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సంక్షేమం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. https://www.dharshininews.com/43211/