schedule Sunday, September 06, 2026

ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య

calendar_today May 9, 2026
person dharshininews
ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య
ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య - నిరాధార కేసులు నిలబడవు - రెచ్చగోడితే గుణపాఠం తప్పదు - కాంగ్రెస్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కక్ష్యపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుపై బీఆర్ఎస్ నాయకులు రెచ్చదొట్టే దోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కౌంటింగ్ రోజున జరిగిన పరిణామాలు అన్నీ అందరికి తెలుసని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై సాక్షాధారాలతో నాన్‌ బేయిలేబుల్ కేసులు నమోదయ్యానని గుర్తుచేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై అపకీర్తిని తెచ్చేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని అన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని అన్నారు. ఎమ్మెల్యే, నేతలపై పెట్టిన నిరాధార కేసులు నిలబడవని అన్నారు. మళ్లీ మళ్లీ రాద్దాంతపు పాలిట్రిక్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. https://www.dharshininews.com/43257/