schedule Sunday, September 06, 2026

డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ

calendar_today May 26, 2026
person dharshininews
డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ
డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ - మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తమాటే - పార్టీ జెండాతో హాజరు వెనుక కేటీఆర్ నిజాలు చెప్పాలి - ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకీత్ అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ డ్రగ్స్ కేసు, విదేశాల్లో హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకు కేటీఆర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ మీడియా సమావేశంలో “రోహిత్ రెడ్డి సస్పెన్షన్ గతంలోనే జరిగింది” అంటూ చెప్పుకొచ్చారని అన్నారు. కాని సోమవారం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాతో హాజరు కావడంలో అంతర్యమేంటో అని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ అబద్ధాల ప్రచారం చేశారని విమర్శించారు. ఇందులో అసలు నిజాలు ఏంటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, తమ పదేళ్ల పాలనలో చేసిన తప్పులతో పాటు తమ నాయకులను కాపాడుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలు దీనిని గమనించాలని కోరారు. తాండూరులో బీఆర్ఎస్ నాయకులకే పార్టీ ఇన్‌చార్జ్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. https://www.dharshininews.com/43373/