schedule Saturday, September 05, 2026

ఉపసర్పంచుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోపాజి బాల్‌రాజ్

calendar_today July 7, 2026
person dharshininews
ఉపసర్పంచుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోపాజి బాల్‌రాజ్
ఉపసర్పంచుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోపాజి బాల్‌రాజ్ - పెద్దేముల్ మండల కమిటీ ఎన్నిక - నియామక పత్రాల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉప సర్పంచుల సంఘం వికారాబాద్ జిల్లా కార్యవర్గంతాండూరు, దర్శిని ప్రతినిధి : ఉప సర్పంచుల సంఘం వికారాబాద్ జిల్లా కార్యవర్గంలో పెద్దేముల్ మండల నాయకుడికి చోటు దక్కింది. ఉప సర్పంచుల సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తోపాజి బాల్ రాజ్ నియామకం అయ్యారు. మంగళవారం జిల్లా అధ్యక్షులు ఎస్. గోపాల్ ఆధ్వర్యంలో పెద్దేముల్ మండల ఉప సర్పంచుల సంఘం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కమిటీలో ఉపసర్పంచుల సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోపాజి బాల్‌రాజ్, పెద్దెముల్ మండల అధ్యక్షుడిగా డి.వై. ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా అశోక్, చంద్రప్ప, ఉపాధ్యక్షులుగా జైపాల్ రెడ్డి, అనురాధ, ప్రధాన కార్యదర్శిగా వాజిద్, కార్యదర్శులుగా హీరాసింగ్ చౌహాన్, పల్లె ముకుంద శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎల్లప్పలను నియమించారు. సలహాదారులుగా మోహిద్, రవీందర్, మొగలమ్మ, ధనవత్ దేవిబాయిలకు కూడా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోపాజీ బాల్ రాజ్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. పదవిని అందించినందుకు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/43709/