schedule Friday, September 04, 2026

ఆసుపత్రి పేరుతో వర్గ రాజకీయాలకు కుట్ర

calendar_today July 14, 2026
person dharshininews
ఆసుపత్రి పేరుతో వర్గ రాజకీయాలకు కుట్ర
ఆసుపత్రి పేరుతో వర్గ రాజకీయాలకు కుట్ర - మహేందర్ రెడ్డిపై విమర్శలు తగదు - ఆ స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు - ఎజెన్సీ లాభాపేక్ష కోసమే నాటకాలు - కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిడ్కర్ రఘు మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి పేరుతో మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. జిల్లా ఆసుపత్రిని తరలిస్తున్నారని ప్రచారం పేరుతో మహేందర్ రెడ్డిపై మౌనం వీడాలని బీఆర్ఎస్ నాయకులు పేర్కొనడం సరికాదన్నారు. గత 25 ఏండ్లుగా తాండూరు అభివృద్ధికి మహేందర్ రెడ్డికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయనపై విమర్శలు చేసే స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. ఎవరి ఏజెన్సీ లాభాపేక్ష కోసం కపట ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు. తాండూరు జిల్లా ఆసుపత్రిని తరలించేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారని గుర్తుచేశారు. చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. అసత్య ప్రచారాలతో పార్టీలో వర్గపోరును సృష్టించాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. https://www.dharshininews.com/43777/