schedule Friday, September 04, 2026

భారిష్‌ కరో భగవాన్..!

calendar_today July 19, 2026
person dharshininews
భారిష్‌ కరో భగవాన్..!
భారిష్‌ కరో భగవాన్..! - ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితుల నుంచి గట్టెంచాలని అందరు భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. తాండూరులోని ముస్లిం సోదరులు కూడా అల్లాహ్ ను వేడుకుంటున్నారు. భారీష్ కరో భగవాన్‌(వర్షాలు కురిపించు దేవుడా) అంటూ ప్రార్థించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని చెన్‌గేష్‌పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గాలో మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్దలు, యువకులు, చిన్నారులు సైతం ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో అల్లాహ్ ను ప్రార్థిస్తూ కరువు పరిస్థితులు రాకుండా వర్షాలు కురిసేలా చూడాలని వేడుకున్నారు. సాగులో ఉన్న పంటలు పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖ శాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణానికి చెందిన మైనారిటీ సోదరులు, మత పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. https://www.dharshininews.com/43835/