schedule Friday, September 04, 2026

కొంపముంచిన నిద్రమత్తు..!

calendar_today July 22, 2026
person dharshininews
కొంపముంచిన నిద్రమత్తు..!
కొంపముంచిన నిద్రమత్తు..! - డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం - స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ - తాండూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తు ఓ పెద్ద రోడ్డు ప్రమాదానికి గురిచేసింది. వేగంగా వెళుతున్న డీసీఎం ఫ్లైఓవర్ బ్రిడ్జి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక సేడం వైపు ఓ డీసీఎం వెళుతోంది. బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తాండూరుకు చేరుకుంది. డ్రైవర్ జితేందర్ అప్పటికే నిద్రమత్తులో ఉన్నాడు. వేగంగా వెళుతుండగా బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద డీసీఎం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ జితేందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీసీఎంను అక్కడి నుంచి తరలించారు. https://www.dharshininews.com/43862/