సాయిపూర్‌లో ఆషాఢం సందడి
July 24, 2026
dharshininews
సాయిపూర్‌లో ఆషాఢం సందడి
- గోరింటాకు పెట్టుకుని మహిళల సంబరాలు
- పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో జోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో ఆషాఢ మాసం సందడి నెలకొంది.
శుక్రవారం సాయిపూర్‌లోని 9వ వార్డులో ఉన్న రాయకుంటా కట్టమైసమ్మ దేవాలయంలో సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరుపుకున్నారు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆమె వార్డు మహిళలతో కలిసి గోరింటాకు కార్యక్రమం జరుపుకున్నారు.
గొరింటాకును తెచ్చి.. రుబ్బి.. అనంతరం చేతులకు గోరింటాకును పెట్టుకున్నారు. ఈ సందర్బంగా పట్లోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గొరింటాకు పెట్టుకోవడం సంప్రదాయమని అన్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు అందమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధుల నుంచి గోరింటాకు రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నాని తెలిపారు.
దేవాలయంలో ఆషాఢ మాసం సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతర కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ నర్సింలు, కౌన్సిలర్లు సుప్రీత కరుణాకర్, నాగలక్ష్మి అనంత్ రెడ్డి, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43892/