schedule Saturday, September 05, 2026

వైభవంగా తొలి ఏకాదశి

calendar_today July 25, 2026
person dharshininews
వైభవంగా తొలి ఏకాదశి
వైభవంగా తొలి ఏకాదశి - దేవాలయాలు భక్తులతో కిటకిట - పాండురంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆషాధ తొలి ఏకాదశిని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయాలకు వెళ్లి ఇష్ట దైవాలను దర్శించుకున్నారు. ఏకాదశి సందర్బంగా దేవాలయాల్లో వెలసిన దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లడంతో దేవాలయాలు కిటికటలాడాయి. ఏకాదశిని పురస్కరించుకుని పట్టణంలోని పాండురంగా స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో పాండురంగా, రుక్మీణీలకు పూజలు, మంగళహారతి నిర్వహించారు. దేవాలయంలో భక్తులు సహస్ర నామా పారాయణం పటించారు. భక్తులతో దేవాలయం సందడిగా మారింది. పలువురు ప్రముఖులు దేవాలయంలో స్వామి వార్లను దర్శించుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణం పాత తాండూరులోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, తాండూరు మండలం దస్తగిరిపేట్‌లోని శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. https://www.dharshininews.com/43904/