ఉప్పొంగిన దేశభక్తి..!
July 26, 2026
dharshininews
ఉప్పొంగిన దేశభక్తి..!
- తాండూరులో ఘనంగా కార్గిల్ దివాస్
- గురుకుల పాఠశాలలో నివాళులు
- పాల్గొన్న డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కార్గిల్ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులు దేశభక్తి ఉప్పొంగేలా కార్గిల్ దివాస్ జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్గిల్ దివాస్ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తిని చాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
అదేవిధంగా 28ఏండ్ల పాటు భారత సైన్యంలో సేవలందించిన మాజీ సైనికుడు అమీనుల్లా ఖాన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులను స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి, కార్యక్రమ కన్వీనర్ కేవీఎం వెంకట్, ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ ప్రతినిధి మన్మోహన్ సార్డా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43913/