schedule Friday, September 04, 2026

సేవలతో శ్రీకారం..!

calendar_today August 1, 2026
person dharshininews
సేవలతో శ్రీకారం..!
సేవలతో శ్రీకారం..! - జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ లో రోగులకు ఉచిత అల్పాహారం - చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం - 5 వరకు నిరంతర కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నుంచి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డులోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు, అలాగే ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు ఉచితంగా ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ కొనసాగుతుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోల్ల బాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43993/