schedule Saturday, September 05, 2026

రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ

calendar_today August 7, 2026
person dharshininews
రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ
రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ - ఆగస్టు 15న గోశాలలో కార్యక్రమం - ఆర్బీఓఎల్, గోశాల ఆధ్వర్యంలో ఏర్పాటు * హాజరు కానున్న సీఈవో బీఎస్ఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్(ఆర్బీఓఎల్), తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో తాండూరు ప్రాంత రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న తాండూరు గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని గోశాల ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సారడా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) హాజరవుతారని వివరించారు. ఉచిత కోడెల పంపిణీలో సన్న చిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న రైతులు తాండూరు గోశాలలో నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తులు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈనెల 12 నాటికి గోశాలలో అందజేయాలని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాల కొరకు గోశాల ప్రతినిధులు మన్ మోహన్ సారడా(9440872526), ఓం ప్రకాష్ సోమాని(6300383211), పటేల్ విజయ్ (9030056755 )లను సంప్రదించాలని సూచించారు. https://www.dharshininews.com/44076/