schedule Thursday, September 03, 2026

విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం

calendar_today August 10, 2026
person dharshininews
విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం
విద్యారంగా అభివృద్ధిలో స్కూల్‌ యజమాన్యాల కృషి అభినందనీయం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను కలిసిన టీఆర్ఎస్ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగ అభివృద్ధిలో పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న కృషి అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షులు ఎంవీఎన్‌ మోహన్ కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి జీ. వెంకటేష్, గౌరవాధ్యక్షులు కీర్తిశర్మ, సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ = విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, టీఆర్ఎస్‌ఎంఏ మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తాండూరు ఉపాధ్యక్షులు అబ్దుల్ వహీద్, జాయింట్ సెక్రటరీ సునీత, కోశాధికారి రమేష్‌ గౌడ్, ఎం.పెద్దేముల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, సలహా కమిటి సభ్యులు ఇందూరు రాములు, సోహైల్ ఉమ్రీ, సభ్యులు నాగభూషణం, యూనస్, శివకుమార్, గణేష్ కుమార్, మహిపాల్, జిలానీ తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44124/