కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మక్సూద్
August 14, 2026
dharshininews
కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మక్సూద్
- నియమించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- ఎమ్మెల్యేకు నేతలకు ధన్యవాదాలు తెలిపిన నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మక్సూద్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల మక్సూద్ చూపిన నిబద్ధత, అంకితభావం, ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను గుర్తిస్తూ ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, ప్రజల కోసం చేసిన కృషిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మక్సూద్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
https://www.dharshininews.com/44209/