schedule Saturday, September 05, 2026

23న తాండూరు కబడ్డీ పోటీలు

calendar_today August 21, 2026
person dharshininews
23న తాండూరు కబడ్డీ పోటీలు
23న తాండూరు కబడ్డీ పోటీలు - ఆరు జట్ల మధ్య పోటీ - స్పాన్సర్ గా శ్రీ సాయిపుత్ర హోమ్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో 23న తాండూరు కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలను ఏర్పాటు చేసినట్లు సంస్థ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శుక్రవారం ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను పోటీల ప్రధాన స్పాన్సర్ శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించారు. పోటీలలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బషీరాబాద్ ఫైటర్స్ జట్టు యజమానికి అజయ్ ప్రసాద్, యాలాల ఈగల్స్ జట్టు యజమానికి ఆదిత్య ఆసుపత్రి, తాండూరు పట్టణ టైటాన్స్ జట్టు యజమానికి మార్వాడీ యువ మంచ్, తాండూరు మండల టైగర్స్ జట్టు యజమానికి స్పైసీ రెస్టారెంట్, పెద్దేముల్ లయన్స్ జట్టు యజమానికి గౌతమీ పాఠశాల, కోట్ పల్లి కింగ్స్ జట్టు యజమానికి రాములు యాదవ్ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల టైటిల్ స్పాన్సర్ గా శ్రీ సాయిపుత్ర హోమ్స్ నిలుస్తోంది. ఈనెల 23న(ఆదివారం) తాండూరులోని అక్షర పాఠశాలలో కబడ్డీ పోటీలు ఉంటాయని వెల్లడించారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉత్తమ కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసి మండల జట్లను సిద్దం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు నరేందర్ , ఆలంపల్లి శ్రీనివాస్, ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్, వేణుగోపాల్ రెడ్డి, జయంత్, సాయిపుత్ర హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ యాదవ్, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్, నాయకులు బంటు మల్లప్ప, ప్రభాకర్ గౌడ్, ప్రేమ్ కుమార్, జొన్నల వినోద్, అన్నారం మల్ రెడ్డి, ఆయా కబడ్డీ జట్ల యజమానులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44304/