schedule Thursday, September 03, 2026

మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక

calendar_today August 28, 2026
person dharshininews
మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక
మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక - ముస్లిం సోదరునికి రాఖీ కట్టిన మాజీ చైర్‌పర్సన్ - అనుబంధాన్ని చాటుకుంటున్న కోట్రిక విజయలక్ష్మీ, సాజిద్ అలీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మత సామరస్యాన్ని చాటేలా రక్షా బంధన్ పండగ వేధికైంది. తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ముస్లిం సోదరుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రతి ఏడాది రక్షాబంధన్ సందర్భంగా సాజిద్ అలీకి కోట్రిక విజయలక్ష్మీ రాఖీ కడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రక్షాబంధన్ పండగ సందర్భంగా సాజిద్ అలీ కోట్రిక విజయలక్ష్మీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ పండగ సంప్రదాయాన్ని పాటిస్తూ సాజిద్ అలీకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాజిద్ అలీకి మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండగ అందరికీ సమానమేనని అన్నారు. మతాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. https://www.dharshininews.com/44413/