schedule Friday, September 04, 2026

బీఎస్‌ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ

calendar_today August 30, 2026
person dharshininews
బీఎస్‌ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ
బీఎస్‌ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ - శ్రీనివాస్‌రెడ్డికి రాఖీ కట్టిన పటేల్ కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని తాండూరుకు చెందిన పటేల్ శ్రీశైలం కుటుంబ సభ్యులు బీఎస్‌ఆర్ నివాసానికి చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ శ్రీశైలం కుమారులు శ్రావణ్ పటేల్, కిరణ్ పటేల్‌ల సతీమణులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి ప్రేమాభిమానాలను చాటుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సైతం వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్‌ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే పవిత్రమైన పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. https://www.dharshininews.com/44450/