నడుస్తున్న బస్సులో గర్భిణీ ప్రసవం
October 19, 2026
dharshininews
నడుస్తున్న బస్సులో గర్భిణీ ప్రసవం
- పండంటి పాపకు జన్మ, తల్లీ బిడ్డా క్షేమం
- బస్సు డ్రైవర్ అప్రమత్తతో ఆసుపత్రికి తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నడుస్తున్న బస్సులోనే ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన తాండూరు ప్రాంతంలో చోటుచేసుకుంది.
సోమవారం కర్ణాటక రాష్ట్రం జట్టూర్ గ్రామానికి చెందిన గర్భిణి పుష్పలత తాండూరు నుంచి చించోలీకి బస్సులో ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవం కావడంతో బస్సులో ఉన్నవారు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో సమీపంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బస్సులోనే పుష్పలత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే బస్సును ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లీ బిడ్డలను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసర సమయంలో స్పందించి సహకరించిన కర్ణాటక బస్సు డ్రైవర్లకు పుష్పలత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
https://www.dharshininews.com/45151/