schedule Tuesday, November 03, 2026

తాండూరులో గుట్కా నిల్వల కలకలం..!

calendar_today October 26, 2026
person dharshininews
తాండూరులో గుట్కా నిల్వల కలకలం..!
తాండూరులో గుట్కా నిల్వల కలకలం..! - బిల్లుల్లేకుండా వ్యాపారంపై అనుమానాలు - సంబంధిత శాఖ అధికారుల తనిఖీలపై ఆసక్తి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో గుట్కా నిల్వ(పాన్‌ మసాలాలు కూడా కావచ్చు)ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్‌ బ్రాంచ్‌ సమీపంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో గుట్కా బ్యాగులు నిల్వ చేసినట్లు సమాచారం. మంతటి పాండయ్య నివాసం ముందు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో సరుకును గోదాములో నిల్వ చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. నిల్వ చేసిన గుట్కా సరుకుకు సంబంధించి జీఎస్‌టీ బిల్లులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిల్వ చేసిన బ్యాగులను రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గుట్కా నిల్వలు, సరుకు రవాణా, బిల్లులకు సంబంధించిన వ్యవహారాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిల్వ చేసిన సరుకు స్వరూపం, వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, పన్నుల చెల్లింపుల వివరాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తనిఖీలు చేపడతారా అన్నది వేచి చూడాలి. https://www.dharshininews.com/45197/