schedule Tuesday, November 03, 2026

గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..!

calendar_today October 26, 2026
person dharshininews
గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..!
గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..! - వ్యాపారి దుకాణం స్వాధీనం - దర్యాప్తు అనంతరం చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో గుట్కా నిల్వల వ్యవహారంపై పోలీసులు స్పందించారు. మంతటి పాండయ్య నివాసం సమీపంలోని ఓ దుకాణంలో గుట్కా, పాన్‌మసాలా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణ ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్ల బృందం దుకాణానికి చేరుకుని నిల్వలకు సంబంధించిన పత్రాలు, బిల్లులు, ఇతర వివరాలను పరిశీలించింది. అనంతరం దుకాణాన్ని మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకుంది. దుకాణంలో నిల్వ చేసిన సరుకుకు సంబంధించిన పత్రాలు, బిల్లులను పోలీసులు పరిశీలించి వ్యాపార నిర్వహణపై వివరాలు సేకరించారు. గుట్కా నిల్వలపై వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు, దుకాణ నిర్వాహకుడు తన వాదనను వినిపించారు. గత మూడేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నామని, అవసరమైన అనుమతులతోనే సరుకు నిల్వలు, రవాణా చేస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారం కారణంగానే పోలీసులు తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. దుకాణంలో నిల్వ చేసిన సరుకు, దానికి సంబంధించిన పత్రాలపై పోలీసుల విచారణ కొనసాగాల్సి ఉంది. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. https://www.dharshininews.com/45199/